అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇద్దరి రిమాండ్

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇద్దరి రిమాండ్ 


అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ నీ పట్టుకొని 
 ఇద్దరిని రిమాండ్ చేసినట్లు ఇల్లంతకుంట ఎస్సై
శ్రీకాంత్ గౌడ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం మధ్యాహ్నం 4 గంటల సమయం లో పోతూర్ గ్రామం శివారు లో గల బిక్క వాగు నుండి ఇల్లంతకుంట గ్రామం నకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న కంది కట్కూర్ గ్రామానికి చెందిన రంగు రజినీకాంత్, మామిండ్ల పర్శరాములు ట్రాక్టర్ ను కందికట్కూరు లో పట్టుకొని అక్రమంగా ఇసుకను తరలించిన ట్రాక్టర్ ను స్వాధీన పరచుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం జరిగింది.అక్రమంగా తరలించిన వ్యక్తుల పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

విద్యార్థినీ విద్యార్థులకు 'షూస్' పంపిణీ

విద్యార్థినీ విద్యార్థులకు 'షూస్' పంపిణీ

 

 న్యూస్ , 11 ఫిబ్రవరి , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల కేంద్రంలో నీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి చదువుతున్న 168 మంది విద్యార్థులకు మంగళ వారం రోజున షూస్ పంపిణీ చేశారు దాతలు
ఎస్ వీరారెడ్డి ఎస్ ఎ సోషల్,జడ్ పి హెచ్ ఎస్ రేపాక
టి సాంబశివుడు ఎస్ ఎ ఇంగ్లీష్, జడ్పీహెచ్ఎస్ గాలిపెల్లి
 కూనబోయిన వినోదఅమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్
 ఆర్.రమణారెడ్డి ఎస్ ఎ ఇంగ్లీష్, జడ్ పి హెచ్ ఎస్ ఇల్లంతకుంటదాతల సహకారంతో 50 వేల రూపాయల విలువైన షూస్ పంపిణీ చేశారు  
 ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సి.హెచ్. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ కలిగి,బాగా చదవాలని తల్లిదండ్రులకు, గురువులకు పేరు తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం. ప్రేమలత మాట్లాడుతూ దాతలు ఇచ్చిన షూస్ ను కాపాడుకోవాలని,వాటిని వారానికి ఒకసారి శుభ్రపరచుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయ బృందం దాతలను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయులు వి.మహేష్ చంద్ర,ఆర్ రమణారెడ్డి, ఎస్.మధుసూదన్ రావు, ఎం . మంజుల, ఐ. ప్రదీప్ రెడ్డి, పి. అనిల్ కుమార్, పి. సునీత, సి.హెచ్.పుష్పలత, ఏ.కవిత, సి.హెచ్.సంపత్ రావు, ఎన్. సత్తయ్య, ఎస్.సుజాత దేవి 
మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

పంట పొలాలను సందర్శించిన ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు

 పంట పొలాలను సందర్శించిన  ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు

 న్యూస్ , 10 ఫిబ్రవరి , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు గ్రామానికి చెందిన వివిధ రైతుల సాగు చేస్తున్న వరి మరియు మొక్కజొన్న పంట పొలాలను పరిశీలించిన జిల్లా ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్), కరీంనగర్ శాస్త్రవేత్తలు రైతులకు తగు సూచనలు చేశారు.
ఈ క్షేత్ర ప్రదర్శనలో భాగంగా జిల్లా ఏరువాక కేంద్రం, కరీంనగర్ కోఆర్డినేటర్ డా. కె. మదన్ మోహన్ రెడ్డి  మాట్లాడుతు జిల్లాలో వరి పైరు దుబ్బు చేసే దశ నుండి చిరు పొట్ట దశలో ఉంది. జిల్లా వ్యాప్తంగా సాగు చేస్తున్న వరి పంటలో కాండం తొలిచే పురుగు ఆశిస్తుందని తెలియజేశారు. యాసంగి వరిలో కాండం తొలిచే పురుగు అత్యంత సమస్యాత్మకంగా ఉన్నది. కావున వరి పంటలో ఆశించే కాండం తొలిచే పురుగు నివారణ చర్యలను సూచించారు.
కాండం తొలిచే పురుగు : ప్రస్తుతం వరి పంటలో కాండం తొలిచే పురుగు (మొవ్వ చనిపోయే దశ) ఎక్కువగా నష్టపరుస్తుందని గమనించడమైనది.
• పురుగు ఉధృతిని గమనించడానికి దీపపు ఎర, సోలార్ దీపపు ఎర లేదా లింగాకర్షక బుట్టలను అమర్చుకొని రెక్కల పురుగులపై నిఘా పెట్టాలి.
ఎకరాకు 3 లింగాకర్షక బుట్టలను పెట్టి అందులో వారానికి బుట్టకు 25-30 పురుగులు పడినప్పుడు తప్పనిసరిగా సస్యరక్షణ చర్యలను చేపట్టాలి.
• ముఖ్యంగా పురుగు నివారణకు సిఫారసు చేయబడని ఇతర 10జి లేదా సేంద్రియ గుళికలను యూరియాతో కలిపి వేయడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని రైతు సోదరులు గమనించాలి.
. గత 2-3 సంవత్సరాల నుండి యాసంగిలో ఈ పురుగు పిలక దశలో ఆశించి ఎక్కువగా నష్టపరుస్తుంది. కనుక నాటు వేసిన 15-20 రోజుల తర్వాత ఎకరానికి కార్టాప్ హైడ్రాక్లోరైడ్ 4జి 8 కిలోలు లేదా కార్బోప్యూరాన్ 3సిజి 10 కిలోలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 4 కిలోలు బురద పదునులో వేయాలి. అలాగే అగ్గి తెగులు సోకిన పంట పొలాల్లో తాత్కాలికంగా యూరియా వేయడం ఆపివేయాలి. తరువాత ఈ తెగులు నివారణకు ఐసోప్రోతయోలిన్ 1.5 మి. లీ. లేదా టేబుకోనజోల్+ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ 0.4 గ్రాముల మందిని లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. అలాగే మొక్క జొన్న పంటలో ఆశిస్తున్న కత్తెర పురుగు నివారణకు క్లోరంత్రనిలిప్రోల్ 0.3 మి. లీ. మందుని లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఈ క్షేత్ర సందర్శనలో జిల్లా ఏరువాక కేంద్రం, కరీంనగర్ కోఆర్డినేటర్ డా.కె.మదన్ మోహన్ రెడ్డి మరియు శాస్త్రవేత్త డా.ఏం. రాజేంద్ర ప్రసాద్ మరియు వ్యవసాయ విస్తరణ అధికారిణి కుమారి లలిత మరియు అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.

ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా : ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి



ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా : ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి

 న్యూస్ , 7 ఫిబ్రవరి, ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హామీ ఇచ్చారు.  ఇల్లంతకుంట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ హరిహరపుత్ర అయ్యప్పస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా నిర్వహించిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి మాట్లాడుతూ అయ్యప్ప ఆలయ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. 
గురుస్వాములు, వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బి.రాఘవరెడ్డి, మండల పరిషత్ మాజీ అధ్యక్షులు ఊట్కూరి వెంకట రమణా రెడ్డి, గుడిసె అయిలయ్య యాదవ్, పార్టీ నాయకులు పసుల వెంకటయ్య, అంతగిరి వినయ్ కుమార్,మామిడి నరేష్, కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, మల్లేషం, కాసిపాక రమేశ్, శ్రీనివాస్, ఎం.రాజు,చిట్టి ప్రదీప్ రెడ్డి,మధు,యశ్వంత్, సాయివర్మ తదితరులు పాల్గొన్నారు.

బిక్క వాగు బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలి

బిక్క వాగు బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలి 
జనం న్యూస్ , 30 జనవరి , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా
ఏబీవీపీ ఇల్లంతకుంట మండల శాఖ ఆధ్వర్యంలో  బిక్క వాగు బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడం పై అక్కేం నాగరాజు
 నిరసన వ్యక్తం చేశాడు  
20 రోజుల్లో బిక్క వాగు బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభిచాలి లేకపోతే  ఎమ్మెల్యే కావ్వంపల్లి సత్యనారాయణ ని మండల కేంద్రం లో తిరగనివ్వమన్నారు  
ఈ సందర్బంగా అక్కేం నాగరాజు మాట్లాడుతూ 2016-2017 సంవత్సరం లో దాదాపు గా 3 కోట్ల రూపాయకు పైగా అంచనాతో మొదలు పెట్టిన బిక్క వాగు నిర్మాణం అర కోరగా సాగిన పనులు అప్పటి నుంచి ఏబీవీపీ ఈ బ్రిడ్జి నిర్మాణం మంద కోడి గా సాగుతుంది అని అనేక సార్లు నిరసనలు ధర్నాలు చేసి బ్రిడ్జి నిర్మాణం 90%అయ్యేలా పోరాటాలు చేసిన ఏబీవీపీ గత ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి నిర్మాణం జరిగేలా చేసారు కానీ నేటికీ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడం తో మండల ప్రజలు అలాగే జిల్లెల్ల కి వెళ్లే ప్రధాన రహదారి ఇది నిర్మాణం పూర్తి కాకపోవడం తో ప్రజలు బిక్కు బిక్కు మంటూ రాత్రి పూట ప్రయాణం సాగిస్తున్నారు రోడ్డు కి పక్కల కి రక్షణ కవచం లేకపోవడం తో అందులో పడి ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు పోయే అవకాశం ఉంది కాబట్టి స్థానిక ఎమ్మెల్యే అయినా మానకొండూర్ శాసనసభ్యుడు కావ్వంపల్లి సత్యనారాయణ  2024 ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం లో ఇచ్చిన హామీ మర్చిపోయారు బ్రిడ్జి నిర్మాణం గెలిచాక చేస్తాను అని చెప్పి ప్రజలను మోసం చేసారు అని అలాగే బ్రిడ్జి నిర్మాణం 20 రోజుల్లో పూర్తి చేయకుంటే ఎమ్మెల్యే ని ఎక్కడికి అక్కడే అడ్డుకుంటాము అని హెచ్చరించారు.

ప్రయాణికుల సురక్షిత,భద్రత కోసం అభయ యాప్

ప్రయాణికుల సురక్షిత,భద్రత కోసం అభయ యాప్
• ఇల్లంతకుంట ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ 
జనం న్యూస్ , 28 జనవరి , ఇల్లంతకుంట :
జిల్లా ఎస్పీ సూచనల మేరకు
ప్రయాణికుల సురక్షిత,భద్రత కోసం అభయ యాప్
లో భాగంగా 80 ఆటోలకి కోడ్ తో అనుసంధానం చేసిన స్టికర్స్ అందజేసినట్లు ఇల్లంతకుంట ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 
ప్రయాణికులు ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో ఆసురక్షితంగా భావించే ఏదైనా పరిస్థితిని సంఘటనలను ఎదుర్కొన్నపుడు ఆటోకి ముద్రించిన "క్యూ అర్ కోడ్"ను స్కాన్ చేయాలని స్కాన్ చేయగానే వెంటనే డ్రైవర్ ఫోటో,వివరాలతో పాటుగా వాహనంకి సంబంధించిన వివరాలు వస్తాయి స్కాన్ చేసిన వ్యక్తి ఫోన్ నెంబర్ యాప్ లో ఎంట్రీ చేసి  ట్రేస్ ద లొకేషన్ అని ఎంట్రీ చేయగానే వాటితో పాటుగా ఎమర్జెన్సీ కాల్, ఎమర్జెన్సీ కంప్లైంట్  ఆప్షన్స్ రావడం జరుగుతుందన్నారు.ఎమర్జెన్సీ కాల్ లేదా టెక్స్ట్ రూపంలో స్పందించినప్పుడు ప్రయాణికులు ప్రయాణిస్తున్న ప్యాసింజర్  వాహనం యొక్క లైవ్ లొకేషన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కి వెళ్తుంది ఆటోలో ఎక్కినప్పటి నుండి దిగేంతవరకు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా  మానిటర్ చేయడం జరుగుతుంది. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సమీపంలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకొని తగు రక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

గతంలో ఆటో డ్రైవర్  ఏదైనా పోలీస్ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే  థిస్ ఆటో నాట్ సేఫ్ అనే రెడ్ సిగ్నల్ వస్తుంది ఇది ప్రయాణికులకు సేఫ్ జర్నీ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. 

ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వామ్యం కావాలని, ఆటో లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని సూచించారు.

వంతడుపుల గ్రామ బిజేపి బూత్ అధ్యక్షుల నియామకం

వంతడుపుల గ్రామ బిజేపి బూత్ అధ్యక్షుల నియామకం
 న్యూస్ , 28 జనవరి , 
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం 
వంతడుపుల గ్రామంలో బిజెపి బూత్ అధ్యక్షులను నియమించడం జరిగింది 269 బూత్ చిమ్మరగొట్టు శ్రీనివాస్ మరొక్క బూత్ 270 బూత్ పండు నరేష్ జనరల్ సెక్రెటరీగా మధు రెడ్డి కీసర పవన్ , 
శక్తి కేంద్రం ఇంచార్జ్ కాట్నపల్లి రవీందర్ రెడ్డి సీనియర్ నాయకులు రాజిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి బిజెపి కార్యకర్తలు దుర్ముట్ల కనకయ్య చింటూ శేఖర్ రాజు బీరయ్య తదితరులు పాల్గొన్నారు.

గ్రామ సభ లా లేక కాంగ్రెస్ సభ లా ?

గ్రామ సభ లా లేక కాంగ్రెస్ సభ లా ?
 • బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడు బుర్ర సూర్య గౌడ్ 
జనం న్యూస్ , 24 జనవరి , ఇల్లంతకుంట :
పథకాలు పేరుతో గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామ సభల్లో కాంగ్రెస్ నాయకుల అతి ఉత్సాహం అప్రజాస్వామికంగా ఉంది అని బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడు బుర్ర సూర్య గౌడ్ అన్నారు ,ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం  ఆయన మాట్లాడుతూ, మండలంలో జరగుతున్న గ్రామ సభల్లో కాంగ్రెస్ నాయకులు స్పెషల్ ఆఫీసర్ల లాగా వ్యవహరించడం బాధాకరం అన్నారు ఇప్పటికైనా అధికారులు వారి బాధ్యత వారు నిర్వహించి అర్హులైన సామాన్య ప్రజలకు పథకాలు అందే విధంగా న్యాయం చేయాలని డిమాండ్ చేసారు లేని పక్షంలో లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల కోసం పెద్ద ఎత్తున  పోరాటం చేస్తాం అన్నారు ఈ కార్యక్రమం లో తాజా మాజీ ఉపసర్పంచ్ లు బుర్ర బాలకిషన్ యాదవ్ ,గోజగాని కిషన్ రావు, రాములు యాదవ్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకి ఏంపిక

రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకి ఏంపిక 
 
 న్యూస్ , 21 జనవరి , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం లోని రహీమ్ పేట ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జి. మైథిలి  స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఖమ్మం లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఏంపికాయినట్లు ప్రిన్సిపాల్ జి. గంగాధర్ ఒక ప్రకటనలో తెలిపారు.జగిత్యాల జిల్లా లో జరిగిన ఉమ్మడి జిల్లా క్రికెట్ స్థాయి పోటీలలో అత్యున్నత ప్రతిభని కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకి ఏంపిక అయినట్లు వ్యాయమ ఉపాధ్యాయుడు మామిడి శ్రీను తెలిపారు.ఈనెల 22 నుండి  24 వరకు జరిగే పోటీలలో మైథిలి పాల్గొంటున్నాదని ఏస్ జి ఎఫ్ సెక్రటరీ నర్రా శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు అభినంచించారు.

Teak-beds-are-provided-by BTR-Foundation-for-a-young-woman's-wedding

యువతి వివాహానికి బిటియర్ ఫౌండేషన్ నుండి టేకు మంచాలు అందజేత Teak-beds-are-provided-by BTR-Foundation-for-a-young-woman's-wedding


 న్యూస్ , 27 డిసెంబర్ , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండల వెల్జీపూర్ గ్రామంలో   ఎడ్ల.శంకర్ - శంకరవ్వ  పుత్రిక లాహారీ (శ్వేత)- శశీకుమార్ వివాహనికి టేక్ మంచాలు 10000 పది వేల రూపాయల వస్తువులను బిటియర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు  బెంద్రం.తిరుపతిరెడ్డి
అందజేశారు ఈ సందర్భంగా ఆయన 
మాట్లాడుతూ.. ఇల్లంతకుంట మండలంలోని పేద కుటుంబాలా కుమార్తెల వివాహలకు ఎల్లపుడు సహాయాలు చేస్తునేవుంటామన్నారు, అన్ని గ్రామాలలోనీ యువకులు ,సేవా ప్రతినిధులు సమాచారమాందించలన్నారు,  కార్యక్రమంలో పాలుగోన్నా సేవా ప్రతినిధులు , నాయకులు బొల్లారం.ప్రసన్న కుమార్ , చిట్యాల. శ్రీనివాస్ , బొల్లారం. పర్శారములు , ఎడ్ల.అనిల్ కుమార్ , మూలిగే.బాలరాజు , కవ్వం.వంశి , ఎడ్ల.ప్రదీప్ , గజ్జల.శ్రీనివాస్ , ఎడ్ల.అరుణ్ , బొంగోని.శ్రీనివాస్ , ఎడ్ల.అభి  నూతన వధువరులను ఆశీర్వదించినారు.